తెలుగు Telugu Rent Buy EBooks Kinige.com Full HD Nallamothu

35 views

Uploaded on July 28, 2011 by nallamothusridhar

పుస్తకాలన్నా, చక్కని సాహిత్యమన్నా ఆసక్తి లేని వారు ఉండరు. అయితే వృత్తి ఉద్యోగాల్లో, పనుల వత్తిడుల్లో పుస్తకాలను వెంట తీసుకువెళ్లి తీరుబడిగా చదువుకునే వెసులుబాటు ఎవరికీ దొరకట్లేదు. మన ఆనందాలైనా, అభిరుచులైనా, స్నేహితులైనా, చదువైనా, రాతలైనా సకలం కంప్యూటర్లూ, మొబైళ్లతోనే ముడిపడిపోయినప్పుడు కంప్యూటర్లోనే అద్భుతమైన రచనలను చదువుకునే అవకాశం దొరికితే బాగుంటుంది కదా! ఆ అవసరాన్ని తీర్చేదే "Kinige.com (కినిగె.కామ్)" అనే సైటు!

ఇ-బుక్స్ దొరికే సైట్లు చాలానే ఉన్నాయి కదా.. ఇదే ఎందుకు?

మనం సాహిత్యాన్ని అభిమానిస్తాం. రచయితల్ని ఆరాధిస్తాం. కానీ ఆ రచయితలు మరో నాలుగు రచనలు చేయాలన్నా మనం పుస్తకాలను కొంటేనే కదా వారు పొట్టపోసుకుని అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించగలిగేది! మరి చాలా సైట్లలో దొంగతనంగా పుస్తకాలను స్కాన్ చేసి పెట్టే ఇ-పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా సాహిత్యాభిమానులుగా సాహిత్యాన్ని మనం బ్రతికిస్తున్నామా? చంపేస్తున్నామా?

సరిగ్గా ఇక్కడే ఈ "కినిగె" సైట్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నేరుగా రచయితల అనుమతితో పుస్తకాలను చవక ధరలకు ఆన్ లైన్ లో విక్రయిస్తూ, అద్దెకు ఇస్తూ అటు రచయితలకు ఆదాయంతో పాటు ఇటు పుస్తక ప్రియులకు ఒరిజినల్ సాహిత్యాన్ని దర్జాగా చదువుతున్నామన్న అనుభూతినీ మిగుల్చుతుంది.

Tags:
Telugu, Sridhar, Nallamothu, Computerera, Computers, Era, Technical, Help, Forum, Tv5, Inews, Live, Inewslive, Telugumagazine, Magazines, Tv9, Abn, Andhrajyoti, Hmtv, Ntv, Rk, News, Etv, Etv2, Gemini, Maa, Zee, తెలుగు, విండోస్, కంప్యూటర్, Entertainment
Comments on తెలుగు Telugu Rent Buy EBooks Kinige.com Full HD Nallamothu

RECOMMENDED CHANNELS